Saturday, February 14, 2026

ప్రతి గింజ ను కొంటాం…రైతన్న ను ఆదుకుంటాం

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం

ద్రోణ బాన్సువాడ

రాష్ట్రం లో ఎక్కడ లేనివిధంగా రైస్ మిల్లర్లను ఒప్పించి ప్రతి గింజను కొంటున్నామని బాన్సువాడ వ్యవసాయ శాఖ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ఆదివారం బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడ,నాగారం,కిష్టపూర్,దేశాయ్ పెట్ గ్రామాల్లో వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం లోని రైస్ మిల్లుల యజమానులతో మాట్లాడి ధాన్యం తీసుకునేలా ఒప్పించడం జరిగిందని అన్నారు.

తెలంగాణ లోనే అత్యధిక దిగుబడి సాధించే బాన్సువాడ రైతులకు ఇబ్బంది కలగకుండా రైస్ మిల్లర్ల యజమానులు ధాన్యం తీసుకుంటామని ఒప్పుకున్న వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని,అధికారులు అందరూ అందుబాటులో ఉంటూ రైతుల ధాన్యం రైస్ మిల్లులకు తరలించేలా చూడాలని అన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ రైతుల సమస్యలు తెలిసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవతో బాన్సువాడ నియోజకవర్గం లో రాష్ట్రం లో ఎక్కడ లేకపోయినా ఇక్కడ రైస్ మిల్లర్ల ను ఒప్పించి ధాన్యం కొనుగోలు ప్రారంభించడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఎరవల కృష్ణారెడ్డి, నాయకులు చిన్న వెంకన్న ,మోహన్ నాయక్, నార్ల ఉదయ్ కుమార్ ,రాచప్ప,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular