ద్రోణ నిజామాబాద్:-
నిజామాబాద్ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంగం అధ్యక్షులుగా బోధన్ పట్టణానికి చెందిన ఇందూర్ పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ ఎంపికయ్యారు. బోధన్ పట్టణం ఆచన్ పల్లి ఇందూర్ బిఈడి కళాశాలలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రవేట్ పాఠశాల యూనియన్ జిల్లా అధ్యక్షులుగా బోధన్ పట్టణానికి చెందిన వ్యక్తి కిషోర్ కావడం ఎంతో అభినందనీయమని మాతృశ్రీ పాఠశాల కరస్పాండెంట్ దిగంబర్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

రాబోయే రోజుల్లో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల తరఫున జిల్లా అధ్యక్షులు కిషోర్ ముందుండి ప్రతి ఒక్కరి సాధకబాదకాల్లో పాలు పంచుకుంటారని తన ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే బోధన్ డివిజన్ పాఠశాలల యూనియన్ లో ప్రధాన పాత్ర పోషించి ఎన్నో సమస్యలను పరిష్కరించిన ఘనత కిషోర్ కే దక్కిందన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎంపికైన కొడాలి కిషోర్ కు బోధన్ పాఠశాల యాజమాన్యాలు అభినందనలు తెలిపారు. బోధన్ జర్నలిస్టులు సైతం ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తనకు జిల్లా అధ్యక్ష పదవి రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ పదవి రావడానికి మాతృశ్రీ కరస్పాండెంట్ దిగంబర్ కృషి వెలకట్టలేనిది అని అన్నారు. అవకాశం ఆయనకు వస్తే తనను జిల్లా అధ్యక్షులుగా కొనసాగాలని కోరడం నిస్వార్థానికి నిదర్శనం అన్నారు.

బోధన్ పట్టణంలోని పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటివరకు తన వెన్నంటే ఉన్నారని, ఇప్పటివరకు ఐకమత్యంగా ఎలా కొనసాగేమో అదేవిధంగా జిల్లా ప్రైవేట్ పాఠశాలలతో యాజమాన్యాలతో ఐకమత్యం గా కొనసాగే విధంగా తోడ్పాటు అందిస్తామన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తాను ముందుండి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ పదవి రావడం తన సొంత కృషితో మాత్రమే రాలేదని ప్రతి ఒక్కరు కృషి చేయడం, మరోపక్క ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సహకారం వాళ్లనే సాధ్యమైందని అన్నారు. ఈనెల నిజాంబాద్ పట్టణంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో నూతనంగా ఎన్నుకోబడిన జిల్లా ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు.

ఈ సమావేశానికి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు అందరూ హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో బోధన్ పట్టణాన్ని విద్యాభివృద్ధిలో మరింత మెరుగు పరుస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే బోధన్ లో ఉన్న విద్యాసంస్థలకు మంచి పేరు ఉందని రాబోయే రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలకు మరింత పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని జిల్లా నూతన అధ్యక్షులు కొడాలి కిషోర్ తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ కళాశాల కరస్పాండెంట్ యార్లగడ్డ శ్రీనివాస్ రావు, సత్యనారాయణ, శ్రీనివాస్ తోపాటు పలువురు పాల్గొన్నారు.
