కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్.
ద్రోణ నిజామాబాద్:-
ధర్నా చౌక్ లో గ్రామపంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ఒక రోజు దీక్షకు పూనుకున్న సందర్భంలో వారి దీక్షకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు సంఘీభావాన్ని ప్రకటించి మద్దతును తెలియజేయడం జరిగింది.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్ పేరుతోటి పెద్ద పెద్ద ప్రక్కన లిస్టు స్వచ్ఛభారత్ ను నిర్మించాలని పిలుపునిస్తున్నారు. తప్ప అద్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛభారత్ నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు మాత్రం విత్తనాలను ఇవ్వకుండా, నెలనెలా వేతనాలు చెల్లించకుండా అత్యధిక భాగం దళితులు పంచాయతీ కార్మికులు గా ఉండే విధులు నిర్వహిస్తున్న సందర్భంలో వారి పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు.

ఇతర వర్గాలు వారు ఎవరూ చేయని పనులను గ్రామపంచాయతీ కార్మికులు నిర్వహిస్తున్నారని వారికి కనీస వేతనాలు నెల నెలా ప్రభుత్వమే గ్రాంట్ల రూపంలో చెల్లించాలని కార్మికులకు భద్రత కల్పించి పని భారాన్ని తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు నువ్వు తెలియజేస్తుందని ఎండగా ఉంటుందని తెలిపారు.
