Saturday, February 14, 2026

గవర్నర్ తో ముఖ్యమంత్రి భేటీ

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్ధిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కి వివరించారు. ఈ సర్వే ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తో భేటీ అయ్యారు. 2025 లో దేశ వ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో తెలంగాణ తరహాలో కుల గణనను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సీఎం గవర్నర్ ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని సీఎం అన్నారు. గవర్నర్ ని కలసిన వారిలో ముఖ్యమంత్రి తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ఎంపీలు పోరిక బలరాం నాయక్ , చామల కిరణ్ కుమార్ రెడ్డి, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , షబ్బీర్ అలీ , డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular