ద్రోణ బోధన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే లో 21 రకాల వికలాంగుల వివరాలు సేకరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టర్ కి నిజాంబాద్ జిల్లా కమిటీ తరఫున వినతిపత్రం అందించారు. అనంతరం ధర్నా చేశారు.కుటుంబ యజమాని మరియు కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు సేకరించడానికి పాటు నెంబర్ కాలంలో మీరు దివ్యాంగులని అడిగినారు 2016 వికలాంగుల కుల పరిరక్షణ చట్టం 21 రకాల వైఖ్యాలను గుర్తించింది. సర్వే పత్రంలోని కాలం 13 లో కోడ్ నింపడానికి షెడ్యూల్ నింపడానికి సూచనల పేరుతో ప్రత్యేకంగా హ్యాండ్ బుక్కు ఇచ్చారు. బుక్కులో మిగతా వివరాలు సమగ్రంగా ఉన్నప్పటికీ వికలాంగుల వివరాలు మాత్రం సమగ్రంగా లేవు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టంగా చేపట్టిన సర్వేలో 21 రకాల ను వెంటనే కోడులు కేటాయించి సర్వే కొనసాగించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు నెలకు పదివేల పెన్షన్ ఇవ్వాలి ఇతర పథకాలు అన్ని అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి తదితర సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల కుల జాతీయ వేదిక ఎన్.పి.ఆర్.డి జిల్లా అధ్యక్షులు గైని రాములు జిల్లా కోశాధికారి రామ్ పటేల్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నజీర్ జిల్లా సహాయ కార్యదర్శి నాగమణి అడప బోర్ర సాయిలు బద్దం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
