బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడ వర్ని,చందూర్,రుద్రుర్ మండలాల లబ్ధిదారులకు చెక్కులను వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు.బాన్సువాడ పోచారం నివాసంలో బాన్సువాడ పట్టణ బీడీ వర్కర్స్ కాలని,శాంతి నగర్ డబల్ బెడ్ రూమ్ లబ్దిదారులకు 27 లక్షల బిల్లుల చెక్కులను అందజేశారు. వర్ని మండల కేంద్రం సి సి డి ఫంక్షన్ హాల్ లో వర్ని మండలంలో 85 మంది లబ్ధి దారులకు 85లక్షల 9 వేల 860 రూపాయలు, రుద్రుర్ మండలం 52 మంది లబ్ధి దారులకు 52 లక్షల 6 వేల 32 రూపాయలు ,చందూర్ మండలం 30 మంది లబ్ధి దారులకు 30 లక్షల 3 వేల 480 రూపాయలు మొత్తం 167 మంది లబ్ధి దారులకు 1కోటి67లక్షల19 వేల 372 రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదిముభారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ , వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా , బాన్సువాడ, వర్ని, చందూర్,రుద్రుర్ మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.
