ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
మహారాష్ట్ర ఎన్నికల రంగంలో పాల్గొని ప్రచారం నిర్వహించి ధర్మాబాద్ లో జరిగిన సభలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షేట్కార్ ఏఐసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ ఘరి నాందేడ్ ఎంపీ అభ్యర్థి రవీంద్ర వసంత్ రావు చవాన్ నైగావ్ ఎమ్మెల్యే అభ్యర్థి మినల్ నిరంజన్ పాటిల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీమాట్లాడుతూ
అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ.తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని వివరించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అసత్య ప్రచారం చేస్తుంది.తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం గ్యారెంటీలను పేదలకు అందజేస్తున్నాం.
నిజాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాం.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు.
మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకం అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నట్లు వెల్లడించారు.
మహారాష్ట్రలో కూడా గెలిపివ్వండి గ్యారెంటీ అమలు బాధ్యత రాహుల్ గాంధీ తీసుకుంటారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఎక్కువ అన్నదాతల ఆత్మహత్యలు జరిగాయన్నారు.కేంద్ర,మహా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచిపోయాయని తీవ్రస్థాయిలో విమర్శించారు.
నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని ప్రధాని మోదీ భావించారని ఫైర్ అయ్యారు.మహాత్మా జ్యోతిరావు పూలే, బాలగాంగధర్ తిలక్, సావిత్రిబాయి పూలే, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ శివాజీ వంటి ఎందరో మహానుభావులు ప్రజల్లో చైతన్యం నింపారని గుర్తు చేశారు. అటువంటి మహా రాష్ట్ర ప్రజలను మోదీ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రానికి రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులను మోదీ గుజరాత్‌కు తరలించుకొని పోయారని ఆరోపించారు.
