ద్రోణ కామారెడ్డి ప్రతినిధి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని లింగంపేట మండలం సజ్జనపల్లి నుండి పోల్కంపేట మధ్యలో 375 లక్షలతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్
అనంతరం పోల్కంపేట గ్రామంలో 20 లక్షల నిధులతో నిర్మించిన పల్లె దవఖానను ప్రారంభించారు. అదే వేదికపై పోల్కంపేట గ్రామానికి చెందిన కొందరు టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి మారుమూల పల్లెలో దవాఖాన రావడం మన అదృష్టం దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఏవైనా అవసరాలు ఉంటే నన్ను సంప్రదించాలని అన్నారు.ఆరోగ్య శాఖ మంత్రి తో మాట్లాడి నియోజకవర్గంలో మరిన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లు, పల్లె ధవాఖానా లు తీసుకువస్తానని, గత ప్రభుత్వం వాళ్ళ నిర్లక్ష్యం వల్ల నిలిచి పోయిన ఎల్లారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ ను తొందరగా పూర్తి అయ్యే విధంగా కాంట్రాక్టర్ కి నిధులు సమకూర్చమన్నారు.
నియోజకవర్గంలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఎల్లప్పుడూ సిబ్బందితో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని జిల్లా మెడికల్ అధికారి ని ఆదేశించారు.
