Saturday, February 14, 2026

బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్యామల

ద్రోణ బాన్సువాడ ప్రతినిధి

బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్యామలను నియమించారు. ఆనాటి నుండి నేటి వరకు రాజకీయాల్లో మచ్చలేని నాయకురాలుగా చలామణి అవుతూ పోచారానికి నమ్మిన బంటుగా సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాప్రతినిధిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్న మహిళలకు నేడు ఆదరణ లభించిందని చెప్పుకోవచ్చు. బాన్సువాడ నియోజకవర్గంలో నాలుగు మార్కెట్ కమిటీలు ఉండగా ఇప్పటికే కోటగిరి, వర్ని మార్కెట్ కమిటీలను కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను నియమించారు. బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిని మాత్రం పోచారం శ్రీనివాస్ రెడ్డి తనను నమ్మిన వారికి ఇప్పించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశారు. పార్టీ కోసం పనిచేయడం మరోపక్క నీతి నిజాయితీగా ప్రజలకు సేవలు అందించిన ప్రజాప్రతినిధులకు గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని రుజువు చేశారు.
బిర్కూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలుగా నూతనంగా ఎన్నికైన దుర్కి మాజీ సర్పంచ్ దుర్గం శ్యామల శ్రీనివాస్ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ని,ఉమ్మడి నిజమాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular