నా ఆశయం లక్ష్యం పూర్తయ్యే వరకు నిద్రపోయేది లేదు
అధికారులతో సమీక్ష నిర్వహించిన పోచారం
ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
సిద్దాపూర్ రిజర్వాయర్ ను పూర్తిచేసి నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో లేని భూములకు సాగునీరు అందించి చిన్న రైతుల భూములను సస్యశ్యామలం చేసేందుకు తన శాయశక్తుల ప్రయత్నాలు చేస్తానని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.హైదరాబాద్ లోని తన కార్యాలయంలో బాన్సువాడ గ్రామీణ మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
బాన్సువాడ నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయ ఆధారితం.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో 70,670 కుటుంబాలు ఉంటే అందులో 66,670 మంది వ్యవసాయంపై జీవనం గడుపుతున్నారు. అంటే 90 శాతం రైతు కుటుంబాలు ఉన్నాయని పోచారం వ్యక్తం చేశారు.
బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం లక్షా యాబై వేల ఎకరాల సాగు భూమి ఉన్నది.
ఇందులో లక్ష ఎకరాలు నిజాంసాగర్ ఆయకట్టులో ఉన్నది.సిద్ధాపూర్ రిజర్వాయర్ నా ఆశయం, ఈ ప్రాంతంలోని 14,000 ఎకరాల మెట్ట భూములకు పుష్కలంగా నీళ్ళు అందాలి. ఆర్ధికంగా రైతులు స్థిరపడాలని నా కల.
భవిష్యత్తులో సిద్ధాపూర్ రిజర్వాయర్ అయకట్టు సస్యశ్యామలంగా ఉండాలి అనేది నా ఉద్దేశ్యం.
రూ. 200 కోట్ల రూపాయల వ్యయంతో, ఒక టిఏంసి కెపాసిటీ తో నిర్మిస్తున్నాం.
రిజర్వాయర్ కట్టతో పాటుగా పొలాలకు నీళ్ళందించే కుడి, ఎడమ కాలువల పని కూడా త్వరిత గతిన పూర్తి చేయాలి.
భవిష్యత్తు తరాల రైతులు సాగునీటికి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకోవాలి.గిరిజనులు, మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని కష్టపడి సిద్దాపూర్ రిజర్వాయర్ కట్టిస్తున్నాము అని అన్నారు.
