Saturday, February 14, 2026

డాక్టర్ అంబేద్కర్ లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన పోచారం భాస్కర్ రెడ్డి

ద్రోణ బాన్సువాడ

డాక్టర్ అంబేద్కర్ దేశానికి చేసిన కృషిని డబ్బుతో వెలకట్టలేమని పేదరికం, వెనకబాటును, కుల మతాలను రూపుమాపణమే తన లక్ష్యంగా రాజ్యాంగాన్ని ఆనాడే రాసిన మహానుభావుడని ఆయన లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాల సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు.
బాన్సువాడ పట్టణం రాజారాం దుబ్బ బుడగ జంగం కాలనిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ,రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు.
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని రాజారాం దుబ్బ బుడగ జంగం కాలనీలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు,ప్రజల సమక్షంలో పోచారం భాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు.భారీగా తరలివచ్చిన బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు నాయకులు, బుడగ జంగాల నాయకులు, అంబేద్కర్ అభిమానులు అనంతరం ఏర్పాటు చేసిన సభలో భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ
ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం దిక్సూచిగా నిలుస్తోందని తెలిపారు.
బాన్సువాడ నియోజకవర్గం లోని ఎక్కువ గ్రామాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను పోచారం కుటుంబ సభ్యులు తమ సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు వారి ఆశయ సాధనకు సంపూర్ణంగా కృషి చేస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం కేసీఆర్ హయంలో పట్టణ కేంద్రంలో కోటి రూపాయలతో అంబేద్కర్ భవనము నిర్మించుకున్నము అని అన్నారు.
నియోజకవర్గంలోని బాన్సువాడ పట్టణ కేంద్రంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక్క బుడగ జంగాల కులస్తులకు 40 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి అర్హులకు అందించిన ఘనత పోచారం దే అని తెలిపారు.ఇంకా ఎవరైనా ఇల్లు లేని నిరుపేదలు మిగిలి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వములో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ దాత పోచారం భాస్కర్ రెడ్డి కి బుడగ జంగం ఆడపడుచులు మంగళ హారతులతో స్వాగతం పలికి శాలువా, దండలతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular