Saturday, February 14, 2026

ఆలయంలో భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

పర్వదిన ప్రత్యేక ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే యశస్విని

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

పాలకుర్తి పట్టణంలోని స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కార్తిక పౌర్ణమి పర్వదినo సందర్భంగా సోమ నాధుడినీ దర్శించుకుని,భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి,మొక్కులు చెల్లించుకొన్ని,పర్వదిన ఏర్పాట్లను స్వయంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి పరిశీలించారు.
ఆలయంలోనీ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు,దర్శనo అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో, అధికారులతో కలిసి పర్వదిన ప్రత్యేక ఏర్పాట్లు పరిశీలించీ, పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని, సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.కార్తీక పర్వదిన సందర్భంగా, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు,కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని,భక్తుల సౌకర్యాలు,సలహాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసి, పర్వదిన వేడుకలు పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని సూచించారు.స్వామి వారి దివ్య,ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.ఎమ్మెల్యే వెంట పార్టీ ముఖ్య నాయకులు, ఆలయ అర్చకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular