ద్రోణ హైదరాబాద్
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా
దెగ్లూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బిలోని తాలూకా సావళి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అసెంబ్లీ అభ్యర్థి నివర్తి రావు కు మద్దతుగా గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందని ప్రజలు ఒకసారి ఆలోచించి ప్రభుత్వ ఏర్పాటు కొరకు కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ పటేల్ , వసీం ఫారూఖీ , సలీం ,ఇమ్రాన్ షకీల్, నాయకులు వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, నాయకులు నేమాని బుజ్జి , మూర్తి,భారి,సాయిలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
