ఏడున్నర కోట్ల చెక్కులను అందజేసిన పోచారం
ద్రోణ బాన్సువాడ
బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టినప్పటికీ బిల్లులు రాకపోవడంతో కొంతవరకు నిరుత్సాహం చెందారు. ఎట్టకేలకు డబుల్ బెడ్ రూమ్ ఇలా నిర్మాణాలను చేపట్టిన లబ్ధిదారులకు ఏడున్నర కోట్ల రూపాయల చెక్కులను ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన పేదలకు డబ్బు వచ్చి దరి చేరడంతో వారి పంట పండినట్లయింది. నియోజకవర్గంలోని కోటగిరి,రుద్రూర్,వర్ని, చందూర్,నసురుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ మండలాల పరిధిలోని డబుల్ బెడ్ రూం ఇళ్ళకు మంజూరైన బిల్లులు రూ.7.51 కోట్ల చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం అందజేశారు.
బాన్సువాడ పట్టణంలోని తన నివాసం వద్ద లబ్ధిదారులకు పోచారం గారు చేక్కులను పంపిణీ చేసారు.
కోటగిరి,రుద్రూర్,వర్ని, చందూర్ మండలాల లబ్ధిదారులకు రూ. 3కోట్ల 99 లక్షల రూపాయలు
బాన్సువాడ,నసురుల్లాబాద్,బీర్కూర్ మండలాల లబ్ధిదారులకు రూ. 3కోట్ల 52 లక్షల రూపాయలు
ఈ కార్యక్రమంలో బాన్సువాడ,నసురుల్లాబాద్, బీర్కూర్, కోటగిరి, రుద్రూర్, వర్ని,చందూర్ మండలాల ప్రజాప్రతినిధులు శంకర్ పటేల్, విఠల్, నా రోజు గంగారం, హమీద్, సిరాజుద్దీన్ నాయకులు,అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
