ద్రోణ కోటగిరి
ఆధ్యాత్మికత భావన పెంపొందించుకోవడంతోనే ప్రజలు సుఖశాంతులతో జీవనం గడపగలుగుతారని ఆధ్యాత్మికతను మరింత పెంపొందించుకోవాలని పోచారం పిలుపునిచ్చారు.
బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రములో నూతనంగా నిర్మించిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామి – సాయిబాబా దేవాలయము యంత్ర – విగ్రహ – ప్రతిష్ట మరియు మహకుంభాబిషేక మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు గణపతి పూజలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాలుపంచుకున్నారు.
18 నవంబర్ సోమవారం ఉదయం నుండి యంత్ర స్థాపన – విగ్రహ ప్రతిష్ట – ప్రాణ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామి వారి కృప,కటాక్షాలు అందరిపై ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కోటగిరి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రీ సాయి అయ్యప్ప చారిటబుల్ ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
