పిసిసి మహేష్ కుమార్ గౌడ్ జోస్యం
ద్రోణ హైదరాబాద్
రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ కనుమరుగవుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఆ పార్టీ నాయకులు నేతలే కోట్లకు పడగలెత్తారని ప్రజల సొమ్మును దోచుకోవడం తోనే గత ఏడాది జరిగిన శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు ప్రజలు చుక్కలు చూపించారని అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన కొనసాగిస్తున్నారని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు పరచామనీ మరిన్ని హామీలను అమలుపరిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు.
ఈ నెల 19 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన నేపథ్యంలో నాయింనగర్ లోని ఫుడ్ అండ్ ఫైర్ సెమినార్ హాల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్ష సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి మరియు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ అధ్యక్షులు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ
మహిళల సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 19న కాలోజీ కళాక్షేత్రం ప్రారంభించడంతోపాటు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పటై ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా ముఖ్యంగా మహిళ స్వయం సహాయక బృందాలు జిల్లా సమైక్య సభ్యులు గ్రామ సమైక్య సభ్యులకు వివిధ శాఖల వారీగా ఈ సందర్భంగా ఆస్తులను పంపిణీ చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి కి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన వరంగల్ జిల్లా అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో సహకారం కానందుని స్పష్టం చేసారు. 19న వరంగల్ లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన, ప్రజా పాలన విజయోత్సవ సభకు పెద్ద ఎత్తున ప్రజల తరలివచ్చి దిగ్విజయం చేయాలని ఎంపీ పిలుపునిచ్చారు.
