షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
181 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
ద్రోణ బాన్సువాడ
పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేయని అటువంటి ఇబ్బందులను తొలగించేందుకే ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పేరిట పేద ఆడబిడ్డల వివాహాలకు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని ప్రభుత్వ సలహాదార్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాన్సువాడ పట్టణ మరియు బాన్సువాడ గ్రామీణ, బీర్కూర్ , నస్రుల్లాబాద్ మండలాల కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ 181లబ్ధిదారులకు చెక్కులను పోచారం పంపిణీ చేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు.
బాన్సువాడ పట్టణంలోని 28 మంది లబ్ధిదారులకు రూ.28,03,248/
బాన్సువాడ గ్రామీణ మండలం 36 మంది లబ్ధిదారులకు రూ.36,04,176/-
బిర్కూర్ మండలం 51మంది లబ్ధిదారులకు రూ.51,05,916/-
నసురుల్లబాద్ మండలం 66 మంది లబ్ధిదారులకు రూ.66,07,656/-
మొత్తం 181 లబ్ధిదారులకు రూ.1 కోటి 81లక్షల 20వేల 996/- రూపాయలు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.
