Saturday, February 14, 2026

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

రైతుల ఖాతాల్లో 500 బోనస్ షురూ

ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు మోసపూరితము

ధాన్యం కొనుగోలులో ముందంజలో ఉమ్మడి జిల్లా

అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివి పోచారం

రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీరుతామని ప్రధానంగా రైతులకు ఇచ్చిన సంక్షేమాలన్నిటిని అమలు చేసి తీరుతామని, రేవంత్ రెడ్డి నోట ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీరుతామన్నారు.
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం రైతులకు 500 రూపాయలు బోనస్ అందజేయడంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తీరిందని, ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరును జీర్ణించుకోలేక ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలు వారి మాటలు నమ్మవద్దని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల ధరి చేర్చడమే తన అంతిమ లక్ష్యం అని పోచారం స్పష్టం చేశారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో వరి ధాన్యం కొనుగోలుపై సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

వరి పంట సాగులో ఉమ్మడి నిజాంబాద్ జిల్లా అగ్రస్థానం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగం దేశానికి ఆదర్శప్రాయులని, మంచి వరి వంగడాలను ఎంపిక చేసుకోవడంతో పాటు, ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో పంటలు సాగు చేయడం అత్యధిక దిగుబడులు సాధిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలోనే మన జిల్లా వరి పంట సాగులో ఎప్పుడూ ఒక అడుగు ముందు ఉంటారని, తెలంగాణలోనే అత్యధిక శాతం దాన్యం పంట మన జిల్లాలో రైతులు పండిస్తున్నారని పోచారం వ్యక్తం చేశారు. మన రైతులు పండిస్తున్న ధాన్యానికి మంచి డిమాండ్ ఉందని, నాణ్యమైన ధాన్యం కావడంతోనే ఇతర రాష్ట్రాల వ్యాపారులు మన ప్రాంతంలోని ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని గుర్తు చేశారు. వ్యవసాయాన్ని ఆదరించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ఆ కృషిలో భాగంగానే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు500 రూపాయల బోనస్ ప్రకటించింది అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో దిట్ట అని, ఇప్పటికే ధాన్యం పండించడం రైతులకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ డబ్బులు కూడా చెల్లించడం షురూ చేశారని రైతులు ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని పోచారం హితం పలికారు.గతంలో కన్నా ఎక్కువ ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేశాం,కనీస మద్దతు ధరతోపాటు బోనస్ అందించిన ఘనత ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు.ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఖండించారు.
నిజాంబాద్,కామారెడ్డి జిల్లాల కలెక్టర్ల దగ్గర నుండి వచ్చిన నివేదికల ప్రకారం.ఒక్క బాన్సువాడ నియోజకవర్గంలో నేటి వరకు
8082 మంది రైతులు నుండి 65,932 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి 67, 901 మంది రైతుల నుండి 4, 98,226 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. కామారెడ్డి ఒక్క జిల్లాలో 30640 మంది రైతుల నుండి 2,10,724 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని పోచారం వివరించారు.నిజామాబాద్ జిల్లా నుండి 37,261 మంది రైతుల నుండి 2,87,523 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది.
గత ఏడాది కన్న ఎక్కువ కొనుగోలు చేశాము.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో 23 జూన్ నిజాంసాగర్ నీటిని ఆయకట్టు రైతులకు అందించడం జరిగింది.ఉపయోగించుకోవడంతో రైతులు ముందస్తు నారుమడులు వేసుకోవడం వలన కోతలు ముందుగానే వచ్చాయి. రాష్ట్రం ఇన్నేళ్ల చరిత్రలో కనీస మద్దతు ధర ₹ 2320తో పాటు ₹500 బోనస్ ను అందించిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకి దక్కింది.
ఈ సందర్భంగా ఒక రైతుగా, రైతు శ్రేయోభిలాషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ప్రభుత్వానికి పోచారం కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటికే కొంతమంది రైతుల ఖాతాలలో బోనస్ డబ్బులు ప్రభుత్వం జమ చేయడం జరిగింది. రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదు .కనీస మద్దతు ధరతో పాటు₹ 500 రూపాయల బోనస్ సైతం రైతుల ఖాతాల్లో వేస్తారు.బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో గల 25 సొసైటీలో దాదాపు అన్నింటిలోనూ ధాన్యం కొనుగోలు పూర్తి కావస్తుంది.
చింతకుంట,గోవూరు, హుమ్నాపూర్,వర్ని సొసైటీలలో దాన్యం కొనుగోలు పూర్తయిపోయింది.
మైలారం, బైరాపూర్, దేశాయిపేట , దుర్కి సొసైటీలలో ఒకటి రెండు రోజుల్లో కొనుగోళ్లు పూర్తవనున్నాయి మిగతా సోసైటీలలో ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేసి తీరుతాం.బాన్సువాడ నియోజకవర్గం లో నిర్మించుకున్న డబల్ బెడ్ రూం ఇళ్లకు మొదటి విడతలో రూ. 8 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు పంపిణీ చేశాం.
ఆదివారం మరో ఏడున్నర కోట్ల బిల్లులను లబ్ధిదారులకు అందించాం. మిగతా వారికి సైతం త్వరలోనే అందిస్తాం.

ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక

ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తాం.
నియోజక వర్గంలో ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని పోచారం హామీ ఇచ్చారు.యాసంగి పంటకు సైతం నిజాంసాగర్ లో నీరు నిండుగా ఉండడంతో రైతులకు నీటిని సకాలంలో అందిస్తాం.నారుమడులు వేయడానికి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశాం.
నవంబర్ లో నారుమడులు పోసుకుంటేనే పంట చివరి కాలంలో వచ్చే వడగళ్ల వాన నుండి పంట నష్టం జరగకుండా ఉంటుంది.

వరి ధాన్యం బోనస్ వచ్చిన రైతులు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. రైతులను మరింత ఆదరించి వ్యవసాయాన్ని పరిశ్రమగా మారిస్తే భవిష్యత్తులో భారతదేశానికి ఆహార ధాన్యాల కొరత ఎదురుకాకుండా ఉంటుందని రైతులు తమ మనోభావాలను వ్యక్తం చేశారు. వ్యవసాయంలో కూలీల కొరత తీవ్రంగా ఎదురవుతుందని ప్రభుత్వాలు యాంత్రికరణ కోసం మరింత శ్రద్ధ తీసుకొని సబ్సిడీపై వివిధ రకాలైన యంత్రాలను అందించాలని రైతులు పోచారానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఎంతోమంది వ్యవసాయానికి దూరమయ్యారని వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించకపోతే దేశంలో తిండి కొరత ఏర్పడి ఆకలి చావులు ఎదురవుతాయని రైతుల హెచ్చరిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి , ఎజాజ్, శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular