Saturday, February 14, 2026

స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ గా పట్టాభి కి పట్టం

ద్రోణ అమరావతి ప్రతినిధి

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశ‌యం స్వ‌చ్ఛ ఆంధ్ర‌, క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్. 2014-19 స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్వ‌చ్ఛంధ్ర ఛైర్మ‌న్ గా వున్నారు. అలాంటి బాధ్య‌త కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ కి ద‌క్క‌టం చాలా గొప్ప విష‌యం. ప‌ట్టాభి నేతృత్వంలో రాష్ట్రం క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ గా మారుతుంద‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆకాంక్షించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ గా టిడిపి నాయ‌కుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రమాణ స్వీకార మ‌హోత్స‌వ కార్య‌క్ర‌మం తుమ్మ‌ల‌ప‌ల్లి కళాక్షేత్రంలో సోమ‌వారం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథి గా విచ్చేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ కి ప‌ట్టాభి స్వాగ‌తం ప‌లికారు. జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న‌కు ముందు గా జాతిపిత‌ గాంధీ, టిడిపి వ్య‌వ‌స్థాప‌కుడు,మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు, ప‌ట్టాభి రామ్ తండ్రి దుర్గాప్ర‌సాద్ చిత్ర‌ప‌టాల‌కు పూలతో నివాళుల‌ర్పించారు. అనంతరం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ గా ప్ర‌మాణా స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్ష‌లు తెల‌ప‌టంతోపాటు ప‌ట్టాభి రామ్ ని శాలువాతో స‌త్క‌రించారు.ఇక‌ ప్రభుత్వ విప్ బొండా ఉమాల‌తో పాటు, మంత్రులు కొల్లు ర‌వీంద్ర‌, కొండ‌ప‌ల్లి శ్రీనివాస్,ఎమ్మెల్యేలు గ‌ద్దె రామ్మెహ‌న్ రావు, న‌క్కా ఆనంద‌బాబు, సుజ‌నా చౌద‌రి, కామినేని శ్రీనివాస్ త‌దిత‌రులు పట్టాభికి అభినందనలు తెలిపారు. అలాగే ఎంపి కేశినేని శివ‌నాథ్
ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో స్వ‌చ్ఛ ఆంధ్ర కార్పొరేష‌న్ ద్వారా వంద శాతం ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లోనూ, అంగ‌న్ వాడీ భ‌వనాల‌కు, క‌మ్యూనిటీ హాల్స్ కు వంద శాతం టాయిలెట్స్ వుండే విధంగా కృషి చేయాల‌ని కోరారు. స్వ‌చ్ఛ భార‌త్ కింద కేంద్ర ప్ర‌భుత్వం నిధులు ఇస్తున్న కూడా అశ్ర‌ద్ద జరుగుతుందని అలా జ‌ర‌గ‌కుండా చూడాల‌ని సూచించారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి స్వ‌చ్ఛ ఆంధ్ర కార్పొరేష‌న్ కి అన్ని విధాలుగా స‌హ‌కారం అందిస్తామ‌ని తెలిపారు. ప‌ట్టాభి కి స్వ‌చ్ఛ ఆంధ్ర కార్పొరేష‌న్ ప‌ద‌వి ప్ర‌క‌టించగానే వెంట‌నే పోన్ చేసి రాష్ట్రంలో వున్న కార్పొరేష‌న్స్ లో కంటే అత్య‌ధిక ప‌ని వున్న కార్పొరేష‌న్ స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ అని, ఇందులోనే చాలా ఎక్కువ ప‌ని వుంటుందని చెప్పిన‌ట్లు చెప్పారు. 2013లో విజ‌య‌వాడ వెస్ట్ లో ఒక మైనార్టీ స‌భ‌లో ప‌ట్టాభి ప్ర‌సంగం విన్నాను. ఉర్ధూలో మాట్లాడారు. ఇంత‌టి వాగ్ధాటి గ‌ల ప‌ట్టాభి త‌ప్ప‌కుండా పెద్ద నాయ‌కుడిగా ఎదుగుతాడ‌ని అనుకున్న‌ట్లు తెలిపారు. అదే విధంగా స్వ‌చ్ఛ ఆంధ్ర కార్పొరేష‌న్ కు ఛైర్మ‌న్ కావ‌టం ఎంతో ఆనందంగా వుంద‌న్నారు. ప‌ట్టాభి త‌న వాగ్ధాటితో గ‌త ప్ర‌భుత్వ దుర్మార్గాల‌ను ప్ర‌శ్నిస్తూ అలుపెర‌గ‌ని పోరాటం చేశాడ‌న్నారు. ఆనాటి ముఖ్య‌మంత్రి కి ప‌ట్టాభి వాగ్ధాటి సెగ త‌గ‌ల‌టం వ‌ల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. ఆ నాటి అధికార ప‌క్షం నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా త‌న వాణి వినిపించటంలో ప‌ట్టాభి ఎక్క‌డా,ఎప్పుడు వెన‌క‌డుగు వేయ‌లేద‌న్నారు. త‌న‌కు తోచిన‌ది మాట్లాడ‌కుండా డాక్యుమెంట్స్ ప్రూప్స్ తో అవ‌తలి వారిని ప్ర‌శ్నించ‌టం ప‌ట్టాభి అల‌వాట‌ని కొనియాడారు. ఎన్ని అవ‌మానాలు ఎదురైనా వాటిని ధైర్యం గా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ల‌టం వ‌ల్లే స్వ‌చ్ఛ ఆంధ్ర కార్పొరేష‌న్ కి చైర్మ‌న్ గా కాగ‌లిగాడ‌న్నారు.
ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయ మైదానంలో చెత్త‌ను క్లీన్ చేసిన ప‌ట్టాభి ఇక నుంచి రాష్ట్రంలో వున్న చెత్త‌ను క్లీన్ చేసి రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ గా చేసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశ‌యం అయిన స్వ‌చ్ఛ ఆంధ్ర ప్ర‌దేశ్ కి శ్రీకారం చుట్టాల‌ని కోరారు. స్వ‌చ్ఛ ఆంధ్ర కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా ప్ర‌మాణ స్వీకారం చేసిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడి సేవ చేయ‌ట‌మే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమ‌న్నారు.ఆనాటి ముఖ్యమంత్రి నేటి పులివెందుల శాసనసభ్యుడు ప్రజాక్షేమం కోసం పని చేయాలన్న ఆలోచనను పక్కనపెట్టి మొదటి నెల నుంచే ప్రజలు అనే రకాలుగా ఇబ్బందులు పాలు చేయడంతో పాటు, రాష్ట్రాన్ని లూటీ చేయటం మొదలుపెట్టాడు. అందుకే ఆ దుర్మార్గుడ్ని ప్ర‌శ్నిస్తూ త‌న గ‌ళం వినిపించిన‌ట్లు తెలిపారు. జ‌గన్ రెడ్డిని గాని ఆనాటి అధికార పార్టీని గాని విమ‌ర్శించే ముందు
కొన్ని గంటలపాటు తాను మాట్లాడదలచుకున్నటువంటి అంశాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని సంబంధిత డాక్యుమెంట్ ఎవిడెన్స్ పేప‌ర్స్ చేతిలో పట్టుకునే మాట్లాడ‌టం జ‌రిగింద‌న్నారు. ఏ రోజు కూడా గాలిలో వార్తలు పోగేసి నిరాధారంగా ఆరోపణ చేయలేదని చెప్పారు. ఇంతటి ప్ర‌జాభిమానం పొంద‌టానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్రోత్సాహకం, పార్టీ పెద్ద‌ల తో పాటు త‌న కుటుంబ స‌భ్యులు స‌హ‌కారం వుంద‌న్నారు.
ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య , మాజీ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్ బుద్ధా వెంకన్న, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా , ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు , రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఎం ఎస్ బేగ్ , రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ , టి ఎన్ టి యు సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్ , అమరావతి బహుజన జెఏసి నాయకులు బాలకోటయ్య , టిడిపి నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ మాల్యాద్రి , ఏపీ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ , మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనురాధ ల‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular