ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి
మత్తు పదార్థాల వినియోగంతో ప్రజల ప్రాణాలకు ఉప్పు ఏర్పడుతోంది. ప్రభుత్వం మత్తు పదార్థాలను నిషేధించినప్పటికీ తేలికగా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా కొందరు భావిస్తూ మత్తుపదార్థాలను జిల్లాలో విచ్చలవిడిగా అమ్మకాలు చేపట్టే విధంగా పావులు కదుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేపడుతూ అక్రమార్కులను ఊచలు లెక్కపెట్టే విధంగా కేసులు చేస్తున్నారు. అయినప్పటికీ డబ్బే ధ్యేయం గా భావించే కొందరు మత్తు పదార్థాలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని జిల్లాలోని యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంబంధిత శాఖ అధికారులు దాడులు జరిపి సుమారు 353 కిలోల రెండు గంజాయి, కిలో నర డైజోఫామ్, రెండున్నర కేజీల ఆల్ఫా జలం పట్టుకున్నారు. సోమవారం రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాలను సంబంధిత అధికారులు కాల్చి బూడిద చేశారు. కోట్ల రూపాయలు విలువచేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిస్ట్రాయ్ చేయడం జరిగిందని జిల్లా ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి తెలిపారు. భీమ్గల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 8 కేసులు చేయడంతో పాటు మత్తు పదార్థాలు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డిపి ఈవో మల్లారెడ్డి, భీమ్గల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వేణు మాధవరావు, ఆర్మూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్టీవెన్సన్, మోర్తాడ్ స్టేషన్ ఆఫీసర్ గుండప్ప, నిజామాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ దిలీప్ వారితో పాటు సిబ్బంది పలువురు పాల్గొన్నారు.
