ద్రోణ హైదరాబాద్
వరంగల్ జిల్లా అభివృద్ధి పనులకు, మహిళ సదస్సు భారీ బహిరంగ సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.
మొదట ప్రముఖ కవి కాళోజి నారాయణరావు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.అనంతరం హనుమకొండ వరంగల్ జిల్లాలకు సంబంధించిన 4601.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపణలు ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్ ద్వారా చేశారు. అనంతరం కళ క్షేత్ర భవనాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అక్కడ నుండి నేరుగా కాళోజీ కళాక్షేత్ర భవన క్రింది అంతస్తులో కాలోజి నారాయణరావు వ్యక్తిగత జీవితంలోని ప్రత్యేక క్షణాలను ప్రతిబింబించే ఫోటోలు, పురస్కారాలు, వ్యక్తిగత వస్తువులు ప్రదర్శించిన ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ ని ముఖ్యమంత్రి సందర్శించారు.
అనంతరం హనుమకొండ ఆర్ట్స్ & సైన్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన విజయోత్సవ మహా సభలో పాల్గొన్నారు.
కడియం శ్రీహరి అనుభవం పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు
ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి గురించి మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి అనుభవపూర్వక సూచనలు తమను ముందడుగు వేయించాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.నియోజకవర్గ అభివృద్ధి కొరకు పట్టు బట్టి నిధులు మంజూరు చేయించుకున్నారని తెలిపారు.అనంతరం సభవేధిక పై వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ ఇందిరా గాంధీ జయంతి రోజు వరంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు వరాల జల్లు కురిపించారని ఎంపీ డా. కడియం కావ్య అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి పాలనలో వరంగల్ దశాదిశా మారనున్నదని స్పష్టం చేశారు. 5,500 కోట్లతో జిల్లాలోని అన్ని నియోజకవర్గల అభివృద్ధి పనులకు జీవో లు జారీ చేశారన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్న ఏకైక ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వరంగల్ జిల్లాను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేశారు.జిల్లాలో రీజనల్, ఔటర్, ఇన్నర్ రోడ్ల తో పాటు, మమునూర్ ఎయిర్ పోర్టును నిర్మాణం జరుగబోతుందని పేర్కొన్నారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు వరద ముంపు నివారణ పనుల నిమిత్తం మరో 160 కోట్ల ను విడుదల చేశారని తెలిపారు. వరంగల్ అభివృద్ధి కోసం అద్భుతమైన మాస్టర్ ప్లాన్ రూపొందించామని, ఈ నగరం చుట్టూ మూడు విడతల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.
ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు. భూసేకరణ కోసం ఇప్పటికే 205 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. వరంగల్ అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతం రాష్ట్రంలో రెండో అతిపెద్ద కేంద్రంగా నిలవనుంది అని అన్నారు. రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
