ద్రోణ హైదరాబాద్
స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో ఇందిరా గాంధీ విగ్రహానికి శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర రవాణా& బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.తనకంటూ చిరస్థాయిగా పేరు నిలుపుకొని నేటికీ ప్రజలంతా ఇందిరమ్మ పాలన రావాలి అని మనమంతా కోరుకొనే ఇందిరమ్మ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఇందిరా గాంధీ విగ్రహానికి శంఖు స్థాపన చేసుకున్నాం.ఇందిరా గాంధీ జయంతి లోపు ఇక్కడ పూలమాలలు వేసుకునే విధంగా ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు.
ఇక్కడ విగ్రహం తో పాటు అభివృద్ధి ఈ ప్రాంత అభివృద్ధి చేసుకుందాం అని మంత్రి పిలుపునిచ్చారు.
ఇందిరాగాంధీ ఆలోచన ప్రజలకు న్యాయం చేయాలి, గరిబి హటావో, బ్యాంకుల జాతీకరణ, అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉక్కు మహిళా గా పరిపాలన దక్షతగాu పాలించింది. ప్రపంచంలోనే తనకంటూ ఒక పేరు నిలుపుకున్న ఇందిరాగాంధీ.
ఈ దేశా ఐక్యత కోసం దేశ విభజన కోసం జరుగుతున్న చర్చ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం జరుగుతున్న చర్చ , రాజ్యాంగాన్ని మార్పు చేస్తూ 400 సీట్లు ఇవ్వండి అనేది జరుగుతుందని చర్చలో ఆనాడు ఈదేశం ఐక్యంగా ఉండాలని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తున్నా ఈ దేశా ఐక్యత కోసం ప్రాణాలు అర్పించారు.
వారిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి
ఇందిరాగాంధీ ఆలోచన విధానం పేదలకు న్యాయం చేయాలని రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ఆదర్శంగా తీసుకోవాలి.
