Saturday, February 14, 2026

నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి బుధవారంమీడియా సమావేశం ఏర్పాటు చేశారు.పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పై మాట్లాడటం హాస్యాస్పదం గా ఉందన్నారు.కాంగ్రెస్ హామీలు అమలు చేయడంలో విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలుపరిచినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న ప్రశాంత్ రెడ్డి సవాల్ ని స్వీకరిస్తున్నాం.వేదిక ఎక్కడో చెప్పు చర్చకు కాంగ్రెస్ నేతలం వస్తాం, మా ప్రభుత్వం ఏం చేసిందో వివరిస్తాం.

రాజీనామాకు ప్రశాంత్ రెడ్డి సిద్ధమా?

హామీలు ఇచ్చి తుంగలో తొక్కిన చరిత్ర బిఅరెస్ ప్రభుత్వానిది.రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం.రుణమాఫీ విషయంలో హామీ అమలుకు కట్టుబడి ఉన్నాం.
ఈ విషయాంలో బిఅరెఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఉచిత బస్, సిలిండర్ సబ్సిడీ, రుణమాఫీతో పాటు వేలాది ఉద్యోగాలు ఇచ్చాము.
ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచాం.రాష్ట్రాన్ని దోచుకుని, అప్పుల పాలు చేసిన బిఅరెస్ నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు.
రైతు భరోసా కూడా అమలు చేస్తాం.ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మానసిక పరిస్థితి బాగా లేనట్లుంది.పిసిసి చీఫ్, సియంల మీద మరోసారి ప్రశాంత్ రెడ్డి మాట్లాడితే తాటతీస్తాం అని జిల్లా అధ్యక్షుడు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular