Saturday, February 14, 2026

రైతులను ఆదరించడంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శం

500 బోనస్ రైతుల్లో ఆనందం పోచారం

రైతులను ఆదరించడంలో భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలబడిందని, దేశంలో ఏ రాష్ట్రం రైతులు పండించిన పంటలకు ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చిన దాఖలా లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీని నేడు నెరవేర్చి రైతుల్లో ఆనందాన్ని నింపారని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల భూమిపూజకు ముఖ్యఅతిథిగా హాజరై పనులకు శ్రీకారం చుట్టారు.
బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం వర్ని మార్కెట్ కమిటీ సీసీ రోడ్డు నుండి తాండ వరకు 1 కోటి రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. వర్ని చౌరస్తా వద్ద రైతులతో కలిసి వరి ధాన్యానికి బోనస్ రావడం వలన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
రుద్రుర్ మండలం అంబం గ్రామ పంచాయతీ లక్ష్మిపూర్ క్యాంపు నుండి అక్బర్ నగర్ వరకు 1 కోటి రూపాయలతో మెటల్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసారు.
పోతంగళ్ మండలం టాక్లి గ్రామం వద్ద టాక్లీ నుండి సాలంపాడ్ వరకు 1 కోటి రూపాయలతో మెటల్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసారు.ఈ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహ ,వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా ,కోటగిరి మండల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ గైక్వాడ్ హనుమంతరావు , వర్ని ,రుద్రూర్, కోటగిరి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు.

ఈ కార్యక్రమాల్లో పోచారం మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు కనీస మద్దతు ధర రూ 2320 తోడుగా క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వడం జరిగింది, దేశంలోనే రూ 500 బోనస్ ఏ రాష్ట్రంలో లేదు మన రాష్ట్రంలోనే ఉంది. కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లై అధికారుల సహాకారంతో రాష్ట్రంలోనే అత్యధికంగా వరి ధాన్యం కొనుగోలు చేసిన నియోజకవర్గం మన బాన్సువాడ నియోజకవర్గం అని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నుండి నవంబర్ 03 నుండి నవంబర్ 23 వరకు నియోజకవర్గంలో 1 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది, ఈ లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యానికి బోనస్ సుమారు రూ 50కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది, కొంత మంది రైతులకు రాకపోవచ్చు,అవి కూడా త్వరలో రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది.
యాసంగి పంటకు కూడా నిజాంసాగర్ లో నీళ్ళు ఉండడం వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు.
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పంచాయితీ రాజ్ విభాగంలో ఉన్నటువంటి రోడ్లకు మన నియోజకవర్గానికి రూ 15 కోట్లు నిధులు కేటాయించారు, అందులోనుండే సీసీ రోడ్డు, మెటల్ రోడ్ల పనులకు భూమి పూజ చేసుకున్నాం.
ఇంకా మన గ్రామంలో సొంత ఇల్లు లేని నిరుపేదలు ఉండచ్చు,వారి కోసం ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తాము. 5 లక్షల రూపాయలు ఇంటి ఆడబిడ్డ పేరుతో పూర్తిగా ఎటువంటి టాక్సులు లేకుండా లబ్ధిదారుల బ్యాంకు ఎకౌంటులోకి జమ చేయడం జరుగుతుంది.
దళితులకు,గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో 6 లక్షల రూపాయలు మంజూరు అవుతాయి అవి తిరిగి కట్టవలసిన అవసరం లేదు. పూర్తిగా 100 శాతం సబ్సిడీ.
నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఇంకా ఎంత మంది సొంత స్థలం ఉండి ఇండ్లు లేని వారు ఉంటే పేర్లు ఇవ్వండి మంజూరు చేస్తాము.

రైతులందరి రుణాలు మాఫీ చేస్తాం

గత ఏడాది శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసి తీరుతారని ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేశామని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు తెలిపారు. ఇప్పటికే సుమారు తెలంగాణ రాష్ట్రంలో 17వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, మాఫీ కానీ రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసి తీరుతుందని కాసుల స్పష్టం చేశారు. దేశంలో ఏ ప్రభుత్వం అయినా పండించిన పంటలకు 500 రూపాయలు బోనస్ ఇచ్చిన సందర్భాలు లేవని మన రాష్ట్రంలో మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ధాన్యం పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయలు ప్రభుత్వం బోనస్ పేరిట రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే పేదలకు ఉచిత విద్యుత్ అందించామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించి తమ సొంత ఆస్తులను పెంచుకొని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టివేసిన పార్టీల నేతలు నేడు ప్రగల్ బాలు పలకడం సిగ్గుచేటు అన్నారు. పదేళ్లపాటు చేయలేని పనులను నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఎంతోమంది ఎన్నికల సమయంలో టూరిస్ట్ లాగా వచ్చి ఎన్నికల పాపాన్ని గడుపుకొని తిరిగి వారు హైదరాబాద్ కు మఖం మారుస్తారని అటువంటి నాయకుల మాటలను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. బాన్సువాడ నియోజకవర్గం లోని ప్రజల కు ఏ ఆపద వచ్చినా శీనన్న నేను ఆదుకుంటామని ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావలసిన అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్లు కోటగిరి గంగాధర్, పోతంగల్ మల్లయ్య, కోటగిరి మండల పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పొతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్, కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, నాయకులు దిగంబర పటేల్, వినోద్, నాగరాజుగౌడ్, చాకూ రే గంగాధర్, హనుమంతరావు పటేల్, ఆనంద్, గృహనిర్మాణ శాఖ అధికారి నాగేశ్వరరావు, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular