Saturday, February 14, 2026

బాల్యవివాహాల విముక్తే ధ్యేయం

భారత ప్రభుత్వం పిలుపు మేరకు మహిళ శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బోధన్ మండలంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల(జూనియర్ కళాశాల) విద్యార్థిని విద్యార్థులచే బాల్య వివాహ విముక్తి భారతదేశం అనే నినాదంతో ర్యాలీ మరియు మానవహారం, ప్రతిజ్ఞ చేపట్టారు. ఐసిపిఎస్, జిల్లా మహిళా సాధికారత కేంద్రం,ఐసిడిఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు., కార్యక్రమంలో DHEW జిల్లా మిషన్ సమన్వయ కర్త పి స్వప్న మాట్లాడుతూ చిన్న వయస్సులోనే వివాహాలు జరగడం వల్ల ఆడ పిల్లలు అనారోగ్యం పాలవుతారు. చిన్న వయస్సులోనే సంబంధిత, సంపర్కంతో బాటు గర్భవతులు కావడం, దీనితోబాటు హెచ్‌.ఐ.వి, రక్త హీనత సోకడానికీ, భగంధరమనే వ్యాధి రావడానికి ( సన్నని నాళంలా వ్యాపించే కురుపు) ఎక్కువ అవకాశం ఉంది.
ఈ బాలికలకు హోదా , శక్తి, పరిణతి లేకపోవడం వలన గృహ హింసకు, వ్యక్తుల వేధింపులకు , సామాజికంగా విడిగా ఉండటం వంటి పరిస్థితులకు గురౌతారు.
బాల్య వివాహాల వలన చాలా మటుకు వారి చదువు ఆగిపోవడం, లేదా అర్ధవంతమైన పనిలేకపోవడం వలన పేదరికాన్ని అనుభవించవలసి వస్తుంది. బాల్య వివాహం లింగ వివక్ష, జబ్బులు, బీదరికమనే క్లిష్టమైన విష వలయం గా నిర్లక్ష్యానికి లోనౌతారు.
లేత వయస్సులో వివాహాలు జరగడం వల్ల కాన్పు కష్టం కావటం వల్ల ప్రసూతి మరణాలు , శిశు మరణాలు అధిక శాతంలో ఉన్నాయని వాటిని తగ్గించుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలని వివరించారు.
ఐసిడిఎస్ ఇన్చార్జి సిడిపిఓ రాధిక మాట్లాడుతూ బాల్యవివాహాలు జరుగుతున్నట్టు మీకు సమాచారం వచ్చినట్లయితే కాల్ చేయాలని అదేవిధంగా చదువు పట్ల శ్రద్ధ చూపించాలి లక్ష్యాలను సాధించేలా ప్రయత్నాలు చేయాలి తల్లిదండ్రులకు నమ్మకం కలిగే విధంగా పిల్లలు వ్యవహరించాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్స్ ఆసియా గారు గోపి లక్ష్మి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బాలచందర్, అంగన్వాడి టీచర్లు పుష్ప, శ్యామల, కళావతి, జమున, రాణి, కనిస్,అనిస్ విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular