Saturday, February 14, 2026

దేశాయ్ మరణం తీరని లోటు

దేశాయ్ తో తనకు 40 ఏళ్ల అనుబంధం కలత చెందిన పోచారం

ద్రోణ బాన్సువాడ ప్రతినిధి

శివరాజ్ దేశాయ్ మరణం ఈ ప్రాంత ప్రజలకు తీరంలోటని ఆయనతో తనకు 40 ఏళ్ల రాజకీయ అనుబంధం ఉందని, ఆయన మరణం తనను కలచివేసిందని పోచారం ఆవేదన వ్యక్తం చేశారు.బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాజ్ దేశాయ్ మరియు వారి కుమారుడు రాజు దేశాయ్ జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి.
ప్రమాదం విషయం తెలుసుకున్న పోచారం హుటాహుటిన హైదరాబాద్ నుండి సంఘటన జరిగిన సంగారెడ్డి – నాందేడ్ హైవే లోని అల్లాదుర్గం ప్రాంతానికి చేరుకున్నారు.ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోచారం కు కోటగిరి నాయకులు జరిగిన సంఘటనను వివరించారు.
అనంతరం జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను పరిశీలించిన పోచారం శివరాజ్ దేశాయ్ తో నాకు నలబై సంవత్సరాల అనుబంధం ఉంది, సన్నిహితుడైన దేశాయ్ ఇలా రోడ్డు ప్రమాదంలో అర్ధాంతరంగా మృత్యువాత పడటం తనను తీవ్రంగా కలిచి వేసిందని బాధ పడ్డారు.

ఆసుపత్రి వైద్యులతో,పోలీస్ అధికారులతో మాట్లాడి త్వరితంగా పోస్టుమార్టం జరిపించి మృతదేహాలను వారి స్వస్థలం కోటగిరి మండలం బస్వాపూర్ పంపించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular