Monday, December 23, 2024

రాజధాని అమరావతి నిర్మాణానికి భారీ విరాళం

ముఖ్యమంత్రికి రూ. కోటి చెక్కు ఇచ్చిన హైదరాబాద్ నివాసి

ద్రోణ అమరావతి, డిసెంబర్ 3

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె పి విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి రూ. కోటి విరాళంగా అందించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి ఈ మేరకు చెక్కును ఇచ్చారు. ప్రస్తుతం హైదారాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న విజయలక్ష్మి అమరావతి నిర్మాణంలో తాము సైతం భాగస్వాములం కావాలనే ఉద్దేశంతో రూ. కోటి ఇచ్చామన్నారు. తమ తల్లి ఇందిరాదేవికి ఆత్మశాంతి కలిగేలా ఆవిడ కోరిక నెరవేర్చేందుకు హైదరాబాద్‌లో తమకున్న కొద్ది స్థలాన్ని అమ్మి విరాళం ఇస్తున్నట్టు పి విజయలక్ష్మి చెప్పారు. పి విజయలక్ష్మి త్యాగనిరతిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన విరాళం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular