ఆసుపత్రి పనులను పరిశీలించిన పోచారం
ద్రోణ బాన్సువాడ ప్రతినిధి
ప్రభుత్వ ఆసుపత్రి పనులను ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులను, సకాలంలో పనులు పూర్తి చేయాలని సూచించారు.
కామారెడ్డి జిల్లా
బాన్సువాడ పట్టణంలో రూ.37.50 కోట్లతో నూతనంగా నిర్మించే 100 పడకల ఏరియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పనులు వేగంగా జరిపించడంతో పాటుగా నాణ్యత లోపం లేకుండా చూడాలని సూచించారు.
ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటానని కాంట్రాక్టర్ కు సూచించారు.
