Friday, February 13, 2026

చిన్నారుల సంరక్షణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ద్రోణ నల్గొండ ప్రతినిధి

నవమాసాలు మోసి ఒక తల్లి బిడ్డకు జన్మనిస్తుందని ఆ బిడ్డకు ఏం జరిగినా ఆ తల్లి తల్లడిల్లిపోతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అందుకే, నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో వైద్యపరికరాల కొరత ఉందని జిల్లా కలెక్టర్ నా దృష్టికి తీసుకురాగానే డీఎం&హెచ్ఓ ను పిలిపించి 30 లక్షల రూపాయలతో 24 గంటల్లోనే అధునాతన వైద్యపరికరాలు ఏర్పాటు చేశామన్నారు.అనంతరం, మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జనాభా కలిగిన జిల్లా నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రికి ప్రతిరోజు 1500 మంది అవుట్ పేషెంట్లు, వెయ్యి మందికి పైగా ఇన్ పేషెంట్లు వస్తారని, ఇక్కడ ప్రతి నెల 600 డెలివరీలు అవుతాయని చెప్పారు. 12 సంవత్సరాల క్రితం తాను ఎంఎల్ఏ గా ఉన్న సమయంలో నవజాత శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, తిరిగి మళ్ళీ ఇప్పుడు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సుమారు 30 లక్షల రూపాయల విలువ కలిగిన అధునాతన పరికరాలు నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లలకు జాండీస్ రావడం, తక్కువ బరువుతో పుట్టడం, తల్లిపాలు తీసుకోలేకపోవడం, అలాగే తల్లులు పిల్లలకు వివిధ కారణాలవల్ల వెంటనే పాలు ఇవ్వలేకపోవడం వంటి వాటన్నిటిని కొత్తగా ఏర్పాటు చేసే ఈక్విప్మెంట్ ద్వారా అధిగమించవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు డెలివరీలతో పాటు, చిన్నపిల్లలకి అత్యవసర వైద్య చికిత్సలు అందించడం వల్ల 60 నుండి 70 వేల రూపాయల ఖర్చు ను మిగిలించి పేదవారికి ఉపయోగపడవచ్చు అని తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న కొత్త భవనంలో ఒక ఫ్లోర్ మొత్తం ప్రసవాల కోసం ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని పూర్తిగా ఉస్మానియా, నీలోఫర్ లాగా అవసరమైన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తామని, ప్రైవేట్ హాస్పిటల్లో లేనివిధంగా ఇక్కడ ఏర్పాటు చేయాలన్నదే తమ ఆలోచనని మంత్రి వెల్లడించారు.
ఇందులో భాగంగా ఢిల్లీ నుండి పల్స్ ఆక్స్ మీటర్లు తెప్పిస్తున్నామని, అలాగే అదనంగా నాలుగు వెంటిలేటర్లు తెప్పిస్తున్నామని, బేబీ కేర్ యూనిట్లో 200 వెల్వెట్ టవల్స్ తెప్పిస్తున్నట్లు తెలిపారు. మార్చ్ లోగా క్రిటికల్ కేర్ యూనిట్ పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. జిల్లాకు ఇటీవల అధునాతన 108 అంబులెన్స్ వాహనాలు వచ్చాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. వచ్చే వారం నుండి గురుకులాలను తనిఖీ చేస్తామని, విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు, ఇతర వసతులను పరిశీలించనున్నట్లు మంత్రి వెల్లడించారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ వివిధ రకాల ఇన్ఫెక్షన్ల వల్ల నవజాత శిశువులకు ఇబ్బందులు కలుగుతుందని, అందువల్ల వారి ఆరోగ్య సంరక్షణలో భాగంగా నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో వివిధ రకాల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్కొక్కటి 15 నైస్ నియోటెక్ వార్మర్లను, 10 నియో ఫోటో తెరఫీ సింగిల్ సర్ఫేస్ యూనిట్లను, 10 ఆకాష్ సైరింగ్ పంపులను, 5 నెల్ కార్ పల్స్ ఆక్షీమీటర్లను, 2 ట్రాన్స్క్యూటేనియస్ బిలురుబినేటర్లు , 100 మిట్టెన్స్, 100 బూటీలు, 200 స్వద్దే బ్లాంకెట్లు, 4 బబుల్ సిపిఎపి కంప్రెసర్లు, మూడు నియోనటల్ రెస్క్యూటేషన్ కిట్లు, నాలుగు ఎన్ఐబిపి యూనిట్లు, 13 లీటర్ల ఆటోక్లేవ్, 4 రూమ్ టెంపరేచర్ థర్మామీటర్లు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేశారని చెప్పారు. వీటివల్ల అప్పుడే పుట్టిన పిల్లలకు ఎంతో మేలు కలుగుతుంది అన్నారు. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు చాలా అవసరమని, మొదటిసారిగా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఈ బ్రెస్ట్ పంపులు ఏర్పాటు చేశామని, అలాగే చిన్నపిల్లల ఐసీయూ ను 50 పడకలకు నుండి 80 కి పెంచడం జరిగిందని, అంతేకాక రోగుల సహాయకుల కోసం వెయిటింగ్ రూమ్ మంజూరు చేయడం జరిగిందని, 40 స్క్వేర్ ఫీట్ లో క్రిటికల్ కేర్ యూనిట్ను నిర్మిస్తున్నామని దీనివల్ల అంటినేటల్ చెకప్ లు, టెస్టులు నిర్వహించవచ్చని కలెక్టర్ తెలిపారు. మంత్రి అడగ్గానే వెంటనే అవసరమున్న అన్ని పరికారాలు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కొని ఏర్పాటు చేయడం నిజంగా వారి మంచి మనసుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, చిన్న పిల్లల విభాగం అధిపతి డాక్టర్ వందన, ఇన్చార్జి సూపరింటిండెంట్ నగేష్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular