Friday, February 13, 2026

అధికారుల విధుల ఆటంకంపై తాసిల్దార్ ఫైర్

ద్రోణ పోతంగల్

పోతంగల్ మండలం పరదిలోని మంజీరా నది నుండి ప్రతినిత్యం అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుండడంతో రెవెన్యూ శాఖ సీరియస్ గా తీసుకుంది. అక్రమ ఇసుక రవాణా లో అరికట్టేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
నిన్న అర్ధరాత్రి (మంగళవారం) 1-20 గంటలకు పోతంగల్ మండలంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పోలీసు మరియు రెవెన్యూ సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బృందము పెట్రోలింగ్ చేస్తుండగా పోతంగల్ గ్రామములో చెక్ పోస్ట్ వద్ద (తిరుమలాపూర్ క్రాసింగ్) వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఒక టిప్పర్ సిబ్బంది చేతికి చిక్కింది. అట్టి తిప్పర్ను కోటగిరి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళుచుండగా, పోతంగల్ గ్రామానికి చెందిన బజరంగ్ దత్తు అనే వ్యక్తి మా రెవెన్యూ సిబ్బందిని దౌర్ధాన్యంగా పక్కకు తోసివేసి కారులో ఎక్కకుండా చేసి దాదాపు 15 నిమిషాలు మా సిబ్బందిని అడ్డగించి, అక్రమ ఇసుక టిప్పర్ ను అక్కడినుండి పంపించినట్లు తాసిల్దార్ మల్లయ్య వెల్లడించారు. అదే ప్రదేశంలో అక్రమ ఇసుక టిప్పర్ల లోడ్ చేసిన నెంబర్ లేనటువంటి JCB స్వాధీనం చేసుకుని కోటగిరి పోలీసులకు స్వాధీనం చేశారు. సిబ్బంది కారు వెళ్లకుండా అడ్డగించి, ప్రభుత్వ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించినాడు, మరియు విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ సిబ్బంది దౌర్జన్యం చేసినాడు. ఇట్టి విషయంలో మా పోలీసు మరియు రెవెన్యూ సిబ్బంది కోటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినారు. వారిపై దౌర్జన్యం చేసిన, మరియు వారి విధులకు ఆటంకం కలిగించిన భజరంగ్ దత్తు అనే వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోతంగల్ తాసిల్దార్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular