వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
ద్రోణ వద్దన్నపేట
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి తీరనిలోటని దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని ఆర్థిక రంగంలో ముందుకు నడిపించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. సంతాపంగా హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే నివాస క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటనీ,దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి మన్మోహన్ ని,ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనత వారికే దక్కుతుందని,ఎటువంటి వివాదాలు లేకుండా 10 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసి వివాధా రహితుడగా పేరు పొందారని,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియా గాంధీ ,మరియు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంలోనే సాధ్యం కావడం జరిగిందనీ,కేంద్ర మంత్రిగా వారు చేసిన సేవలు దేశం ఎన్నటికీ మార్చిపోదని,సోనియా గాంధీ కి ప్రధానిగా అవకాశం వచ్చినప్పటికి మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణల దృష్ట్యా ప్రధాని పదవిని వారికి ఇవ్వడం జరిగిందని,వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నట్లు ఈ సంధర్బంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల డివిజన్ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
