ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే నాగరాజు
ద్రోణ వరంగల్ ప్రతినిధి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధి లోని పైడిపల్లి గ్రామ శివారు లో వికలాంగుల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలు అన్యాక్రాంతం అవుతున్నాయని వికలాంగులు వినతి పత్రం అందించగా త్వరలోనే మీ సమస్య పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం శనివారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి తో కలిసి ఇళ్లను పరిశీలించారు.


అంతర్గతంగా ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మొదటిగా డబుల్ బెడ్ రూమ్స్ వికలాంగులకు ఇచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్ ని కోరిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.
అనంతరం కలెక్టర్ సానుకూలంగా స్పందించి వికలాంగుల కోసం నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరితిగతన అన్ని పనులు పూర్తి చేయించి అందించే విధంగా కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
