దేవుడు తర్వాత వైద్యుడే దేవుడని ప్రజల భావన
ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి
ప్రైవేటు హాస్పిటల్స్ లలో ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి వాటిపై పట్టించుకునే నాధుడే లేకపోవడం ప్రజలు కూడా వైద్య నారాయణ అంటూ ప్రైవేటు హాస్పటల్లకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు.

కానీ దీనినే అలుసుగా తీసుకొని డాక్టర్లు ప్రజల ప్రాణాలతోటి చలగాటలాడుతున్నారు. నర్సింగ్ చేసిన సిస్టర్లను హాస్పటల్లో పని ఇస్తే జీతభత్యాలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని ఎవరిని పడితే వారిని అటెండర్లను పెట్టుకొని ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్నారు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారిపై కేసులు పెట్టి ప్రజలను కొట్టడం బయటకు నెట్టి వేయడం వంటివి చేస్తున్నారని పలు పలుమార్లు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయినా డోంట్ కేర్ అంటూ డిఎంహెచ్వోలు పట్టించుకోవడం లేదు. ఆర్మూర్లో దొంగ డాక్టర్లు బయటపడ్డారు. నిజామాబాదులో ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఎవరిని పడితే వారిని చిన్న పిల్లలను అటెండర్లుగా పెట్టి ఇష్టారాజ్యము గా వ్యవహరిస్తున్నారు.

ప్రైవేటు హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లాగా పెరిగిపోతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కి వెళ్తే సరియైన వైద్యం అందడం లేదని దానిలో కూడా విభేదాలు చూపిస్తున్నారని అందుకే మేము ప్రైవేటు హాస్పటల్ల వైపు మొగ్గు చూపవలసి వస్తుందని ప్రజలు ఆపోతున్నారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందిస్తామని హామీలు పాలకులు ఓ పక్క పెద్ద ఎత్తున హామీ లిస్తూ ఉన్నారు. ప్రజలను ఎందుకు ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారో అర్థం అవ్వకుండా ఉందని గవర్నమెంట్ హాస్పిటల్స్ లలో వేలకు వేలు జీతాలు ఇస్తూ రెండు గంటలసేపు కూర్చొని బయట ప్రైవేటు హాస్పిటల్స్ ఓపెన్ చేసి వాటిపై ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎనిమిది గంటల డ్యూటీ కూడా చేయని డాక్టర్లు ఎందుకు వస్తున్నారో తెలియడం లేదు.

దీనిపై వైద్య మంత్రి గాని దగ్గరలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారో ప్రభుత్వం ఎంతో అభివృద్ధి పనులతో హామీలు ఇస్తున్న పట్టించుకునే నాధుడు లేకపోవడం ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురి అవ్వాల్సి వస్తుందని ఒక వైద్యుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉండి వైద్యం చేసే నాధుడు లేకపోవడం ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా మారింది.
