Friday, February 13, 2026

సమ సమాజ స్థాపన కోసం కృషి చేద్దాం

ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి:-

సిపిఐ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ కేఆర్ విజ్జు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ 2025 జనవరి 7 తేదీనాడు అఖిలభారత దళిత హక్కుల ఉద్యమం (AIDRM) రెండవ జాతీయ మహాసభలు హైదరాబాదులో జరుగుతున్నాయి ఈ మహాసభలో పాల్గొన్న కేరళ కామ్రేడ్ కె.ఆర్ విజ్జు గుండెపోటుతో మృతి చెందడం జరిగింది కె ఆర్ విజ్జు కేరళ రాష్ట్రంలో ఆర్టీసీ కండక్టర్ గా ఉంటూ ఏఐటియుసి ట్రేడ్ యూనియన్ కేరళ రాష్ట్ర నాయకుడిగా మరియు కేరళ రాష్ట్రంలో అనగారిన వర్గాల కోసం దళిత సంఘం నాయకుడుగా ఉంటూ అనేక సేవలు చేయడం జరిగిందని ఆయన కోరుకున్నా సమసమాజం కోసం అందరం కృషి చేద్దామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు వై.ఓమయ్య, కమలాపురం. రాజయ్య, నాయకులు సక్కి సురేష్, అజిజ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular