
సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ విమర్శ
ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి:-
పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం ఆంధ్రప్రదేశ్,బీహార్ రాష్ట్రాలకే కేటాయించబడ్డదని తెలంగాణకు బిజెపి మొండి చేయిచుయించిందని గతంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర విభజన హామీల అమలుకై నిధులు కేటాయిస్తామని నేడు తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడం ఊహించిందేనని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిజెపి మంత్రులు, పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయించాలని అన్నారు.

ఈ బడ్జెట్ అంకెల గారడి మాదిరిగానే ఉన్నదని పేద ప్రజలకు ఈ బడ్జెట్ తో ఒరిగింది ఏమీ లేదని అన్నారు
