బోధన్ ద్రోణ:-
బోధన్ పట్టణ మున్సిపాలిటీలో ఇంచార్జ్ మేనేజర్ సుజాత మేడం ను కలసి బోధన్ పట్టణంలో ప్రతి వార్డులో దోమల బెడద విపరీతంగా పెరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా నిరుపేద ప్రజలు.డెంగ్యూ ,మలేరియా, టైఫాయిడ్,లాంటి విష జ్వరాల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ కి వెళుతూ వేల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి అదీగాక బోధన్ పట్టణంలోని 38 వార్డులలో మురుగు నీరు ఖాళీ స్థలాల్లో నిలువ ఉండడం వల్ల అందులో దోమలు ఎక్కువ వృద్ధి చెందే అవకాశం ఉన్నది, కావున మురుగు నీరు ఉన్న ఖాలి స్థలాల్లో ఆయిల్ బోల్స్ వెయ్యాలని మరియు గతంలో మున్సిపాలిటీకి ఫాగ్ మిషన్లు తెప్పించడం జరిగింది. వాటితో బోధన్ పట్టణంలోని అన్ని వార్డులలో ఫాగ్ (స్ప్రే ) చెయ్యాలని ఇంచార్జ్ మేనేజర్ సుజాత కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు పెరక రామకృష్ణ ,నాగుల రవిశంకర్ గౌడ్, షేక్ తొఫిక్ ఖాన్,పాల్గొన్నారు
