నిరుపేదలకు సొంతమయ్యేలా చూడాలి
బోధన్ టౌన్ ద్రోణ:-
ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం కింద కేటాయించిన భూములకు రిజిస్ట్రేషన్ చేసి న్యాయం చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య కోరారు. ఆయన శనివారం రోజు బోధన్ పట్టణంలోని తాలూకా రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ ల ద్వారా గతంలో అర్హులైన వారికి భూ పంపిణీ పథకం లో అందించిన ఎన్ఎస్ఎఫ్ భూములకు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. 1994 సంవత్సరం నుండి మూడు విడుదలుగా ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ కూలీలుగా పనిచేసిన పలువురితోపాటు అర్హులైన నిరుపేదలకు 6000 ఎకరాల భూమి పంపిణీ చేశారని అన్నారు. నాటి ప్రభుత్వాలు ఇట్టి భూములకు వివిధ కార్పొరేషన్ ద్వారా బోర్ పంపిణీ పథకం కింద ఎకరాకు 5000 చొప్పున చెల్లించి వారికి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని ఆదేశించారు. కొందరు నిరు పేదలు అనివార్య కారణాల వల్లన సాగు చేసుకుంటున్న భూములకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయారని తెలిపారు. కొందరి ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఈ భూములను ఇతరులకు అమ్ముకున్నారని గత కొంత కాలంగా రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో నిరుపేద కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పంపిణీ చేసిన భూములను సాగు చేసుకుంటున్నా లబ్ధిదారులను గుర్తించి వారికి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి నిరుపేదలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు మిర్జాపూర్ సాయన్న. బాలరాజ్ సాయిలు.. అబ్బాయ్య. సంబాని ప్రసాద్. రాము. తదితరులు ఉన్నారు.
