Friday, February 13, 2026

పట్టభద్రులంతా ఏకమై కదలిరండి

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి

బోధన్ టౌన్ ద్రోణ:-

పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐక్యంగా కదిలి రావాలని తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలు పరిష్కరించేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి మందిరం ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల నిర్వాహకులు డాక్టర్ వూట్కూరి నరేందర్ రెడ్డి ట్రస్మా సభ్యులు నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలకు రావలసిన బకాయిలు విడుదల కు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తనను గెలిపిస్తే రాబోయే రోజులలో ప్రైవేటు విద్యాసంస్థలలో ఉపాధ్యాయులకు బేసిక్ శాలరీ, ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల పెండింగ్ ఫీజులు రియంబర్స్మెంట్ వాటి గురించి ముఖ్యమంత్రితో మాట్లాడి 50 శాతం ఇప్పిస్తారని విద్యాసంస్థలకే ప్రత్యేక నిధిని కేటాయిస్తానని అన్నారు. నన్ను గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యకై పోరాడుతానని పట్టభద్రుల అభివృద్ధి కోసం పాటుపడతానని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదువుకోవాలంటే సరియైన వసతులు లేకపోవడం చాలా ఇబ్బందికరంగా మారిందని తెలిపారు.

వాటిపై దృష్టిని పెట్టి మార్పులు తీసుకువస్తానని బాలురు, బాలికలు వేరువేరుగా వెళ్లి చదువుకునే విధంగా అన్ని వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. పాతబడిన పుస్తకాలను తీసి కొత్త వాటిని గ్రంథాలయాల్లో పెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఇందూర్ పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్, చక్రవర్తి, శ్రీనివాసరావు, రవికుమార్, ప్రజాప్రతినిధులు, ప్రైవేటు విద్యాసంస్థల, కరస్పాండెంట్లు మరియు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular