Friday, February 13, 2026

100 మంది పట్టభద్రుల నామినేషన్

32 పట్టభద్రుల నామినేషన్లు తిరస్కరణ

ఒక ఉపాధ్యాయుల నామినేషన్ తిరస్కరణ

నిజామాబాద్ ద్రోణ ప్రతినిధి:-

ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం నామినేషన్ పరిశీలన ప్రక్రియ ముగిసింది. మెదక్ నిజామాబాద్ కరీంనగర్ అదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం 100 మంది నామినేషన్లు వేయగా 32 మంది నామినేషన్లు వివిధ కారణాల చేత ఎన్నికల అధికారులు తిరస్కరించారు. సరియైన ఫార్మేట్ లో ఉన్న 68 మంది నామినేషన్ లను ఆమోదం పొందాయి. ఉపాధ్యాయుల నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురి అయింది. 16 మంది నామినేషన్ లోని మాత్రం ఆమోదించారు. పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల మూడు నుండి పది వరకు నామినేషన్లను స్వీకరించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన కలెక్టరేట్లోని ఆడిటోరియం లో నామినేషన్ వేసిన వారి సమక్షంలోనే నిర్వహించారు.

** ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి

  • నిబంధన ప్రకారం పరిశీలన

ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ అభ్యర్థులు నామినేషన్ సమర్పించిన సందర్భంగా ఏవైనా లోపాలు ఉంటే గుర్తించి అభ్యర్థులకు షార్ట్ మెమోలు ఇచ్చి సరి చేసుకునేందుకు అవకాశం కల్పించామని అన్నారు ఈ అవకాశాన్ని కొంతమంది వినియోగించుకున్నారని తెలిపారు. నియమ నిబంధనలను అనుసరించి నామినేషన్ల ప్రక్రియ జరిగిందని సరైన ఫార్మా ట్లో సమర్పించని నామినేషన్లను తిరస్కరించారు. అభ్యర్థుల ఆదేశాల నివృత్తి కోసం నామినేషన్ తీసుకునే తేదీలలో హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. పరిశీలన ప్రక్రియ అనంతరం అభ్యర్థుల నుండి అభ్యంతరాలు కోరారు. తిరస్కరణ పై అభ్యంతరం వ్యక్తం చేసిన వారి సందేహాలను నివృత్తి చేశారు. తిరస్కరణకు గల కారణాలను వివరంగా అభ్యర్థులకు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలనకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ రామన్, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్, ఏవో నరేందర్ తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular