Friday, February 13, 2026

అక్రమార్కులపై కొరడా జులిపిస్తా….

అన్యాయాన్ని ఎదిరించి న్యాయం కోసం పోరాడుతా జిల్లా ఎస్పీ జానకి…

మొన్న జూదం.. నిన్న అక్రమ బియ్యం,.. నేడు అక్రమార్కుల ఇసుక రవాణాపై దృష్టి సారించిన జిల్లా పోలీసులు…

నిర్మల్ పట్టణంలో అక్రమ ఇసుక నిల్వలపై కొరడా జులిపించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్.

ద్రోణ ఆదిలాబాద్ ప్రతినిధి:-

నిర్మల్ పట్టణంలొ జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్వయంగా అక్రమంగా ఉంచిన ఇసుక నిల్వలపై ఆకస్మికంగా గాజుల్ పెట్, రాంనగర్, మంజులపూర్ ప్రాంతాలను ఆకస్మిక తనిఖీలు చేసి ఇసుక నిల్వలను సీజ్ చేయటం జరిగింది. ఈ తనిఖీల్లో ఎస్పి తో పాటు నిర్మల్ ఏఎస్పి రాజేష్ మీనా ఐపిఎస్, పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్, అర్బన్ తహసిల్దార్ రాజు, పోలీస్ సిబ్బందితోపాటు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలించిన, నిల్వ ఉంచిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక పోలీస్ టీం, స్పెషల్ టాస్క్ ఫోర్సెస్ లను ఏర్పాటు చేశామని, అనుమతులు లేకుండా జిల్లాలో వేర్వేరు ప్రాంతాలనుండి ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో విశ్వసనీయమైన సమాచారం తో 17 ఇసుక రీచ్ లు, 35 ఇసుక నిల్వలను ఉన్నాయని సమాచారం ఉంది అని తెలియజేసారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో, బ్లూ కోల్ట్, పెట్రోల్ కార్ సిబ్బందితో ఆన్లైన్ మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ ఇట్టి అక్రమ నిల్వలపై సూచనలు ఇవ్వటం జరిగింది. జిల్లాలోని గోదావరి, స్వర్ణ వాగు, శుద్ధ వాగు , పరిసర ప్రాంతాల్లో నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని తెలిసింది కాబట్టి అట్టి ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించే పోలీస్ సిబ్బంది కి తగిన సూచనలు చేశారు.

అన్ని ప్రాంతాల్లో తిరిగి ఇసుక అక్రమ నిల్వలు టానికి చేసి రెవిన్యూ అధికారుల సహకారం తో సీజ్ చేయాలని తెలియజేసారు. ఇసుక రీచ్ లనుండి ఎవరు అనుమతులు లేకుండా ఇసుక తరలించకుండ చూడాలన్నారు.
ఈ ఆన్లైన్ మీటింగ్ లో భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐ.పి.ఎస్, నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా ఐ.పి.ఎస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, అన్ని పోలీస్ స్టేషన్ ఎస్ఐ లు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular