Friday, February 13, 2026

డిసిసిబి మరియు సహకార రంగ పాలకవర్గాల పదవీకాలం పొడిగింపు

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రoలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పాలకవర్గం మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘల (పాక్స్) పాలకవర్గాల పదవీకాలన్ని 6 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు డిసిసిబి చైర్మన్లు సత్తయ్య,రమేష్ రెడ్డి,దేవేందర్ రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి,బోజా రెడ్డి,వేంకటేశ్వర రావు మరియు టీజీ క్యాబ్ ఎండీ గోపి IAS తో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఉత్తర్వులు అందుకున్నారు.
ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూసహకార సంఘాల పదవి కాలం పొడగించినందుకు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి కి,జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,సీతక్క మరియు కొండా సురేఖ కి,జిల్లా ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు,అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రజా ప్రభుత్వంలో సహకార సంఘాలకు అందిస్తున్న సహాయ సహకరాలకు ధన్యవాదాలు,రైతుల సంక్షేమం కొరకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సంఘాల బలోపేతానికి రాబోయే రోజుల్లో మరింత కృషి చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular