గొప్ప నాయకుడిగా వేణు గోపాల్ కు కితాబు
నిజామాబాద్ జిల్లా విద్యుత్ కార్మిక సంఘం బలోపేతంతో పాటు కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం తన లక్ష్యమని స్థానిక విద్యు త్ కార్మిక సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా ఐ ఎన్ టి యు సి జిల్లా స్థానిక అధ్యక్షులు వేణుగోపాల్ బెస్ట్ లీడర్ గా ఎంపికయ్యారు. హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 ఐ ఎన్ టి యు సి రాష్ట్ర నాయకులు కార్యదర్శి శ్రీధర్, అధ్యక్షులు సంజీవరెడ్డి చేతుల మీదుగా వేణు గోపాల్ కు ప్రతిభ పురస్కారం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఉద్యోగ సంఘముగా కొనసాగుతూ కార్మికులకు ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ వేణు కార్మికులకు భరోసా ఇస్తున్నారు. తమ సంఘం కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉందని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేందుకు తమ సంఘం సైతం కృషి చేసిందన్నారు. కార్మికుల కష్టాలను తాను చూస్తూ ఊరుకునేది లేదని ఎవరికైనా సమస్య వస్తే తాను పరిష్కారానికి కృషి చేస్తానని వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనల మేరకు విడుదల నిర్వహిస్తూ తమ హక్కుల కోసం పోరాటం చేయడంలో తప్పు లేదన్నారు. కార్మికుల సమస్యలు ఎన్నో పెండింగ్లో ఉన్నాయని అటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం రాష్ట్ర బాధ్యుల దృష్టికి ఇప్పటికే తీసుకువెళ్లాలని వేణు గోపాల్ స్పష్టం చేశారు. సంఘ నాయకుల సైతం విధులను నిర్వహిస్తూ మరో పక్క కార్మిక శ్రేయస్సుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
