వారి బోధనలు యువతకు ఆదర్శం పోచారం వెల్లడి
ద్రోణ బాన్సువాడ ప్రతినిధి
బాన్సువాడ గ్రామీణ మండలం పోచారం తండా, రాంపూర్ తండా గ్రామస్థులు ఏర్పాటు చేసినటువంటి “సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి” ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి.
ఈసందర్భంగా పోచారం మాట్లాడుతూ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి సందర్భంగా బంజారా సోదర, సోదరీమణులకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు.
సేవాలాల్ మహారాజ్ వ్యక్తి కాదు శక్తి, స్వయంగా దేవుడు,ఎన్నో మహిమలు, అద్భుతాలు చేశారు.
జన్మించింది బంజారా కుటుంబంలో అయినా సేవాలాల్ మహారాజ్ సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. అందరికీ దైవ స్వరూపులు.వారి సందేశం, బోధనలు, సూచనలు నాటికి, నేటికీ అందరికీ ఆదర్శం, ఆచరించాలి.సేవాలాల్ మహారాజ్ సూచించిన మార్గం నేటి సమాజానికి, ముఖ్యంగా యువకులకు ఆదర్శం.
సేవాలాల్ మహారాజ్ సూచించిన మార్గంలో మనం నడవాలి.నియోజకవర్గంలోని ప్రతి తాండాలో శ్రీ జగదాంబ, శ్రీ సేవాలాల్ మహారాజ్ ల గుడులకు నిధులను మంజూరు చేయించి నిర్మించుకున్నాం.
