Friday, February 13, 2026

కోటగిరిలో ఘనంగా ధర్మ బిక్షం జయంతి వేడుకలు

ద్రోణ కోటగిరి:-

ప్రజల మనిషి కామ్రేడ్ బొమ్మ గాని ధర్మం బిక్షం 103 జయంతి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర గీత సంఘం రాష్ట్ర కార్యదర్శి విటల్ గౌడ్ డిమాండ్ చేశారు. గీత కార్మికుల ఆశాజ్యోతి కామ్రేడ్ బొమ్మ గాని ధర్మభిక్షం 103 జయంతిని ఘనంగా నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివార్ల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు గీతా పనివాళ్ల సంఘం వ్యవస్థాపకులు కామ్రేడ్ బొమ్మ గాని 103 జయంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ళ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ విటల్ గౌడ్ మండల అధ్యక్షులు బి వెంక గౌడ్ మాట్లాడుతూ ఈత కార్మికుల హక్కుల కోసం గీత సొసైటీలో ఏర్పాటు కోసం ఎంతో కృషి చేసిన మహానీయుడు ధర్మభిక్షం ని అన్నారు.ఆయన పోరాట ఫలితమే గీత సొసైటీలు ఐదు ఎకరాల భూమి వన పెంపకం గీత కార్మికులకు పెన్షన్ లభించిందని అన్నారు ధర్మ బిక్షం గారు సూర్యాపేటలో 1922లో గీత కార్మికుల కుటుంబంలో జన్మించినాడు గౌడ కులస్తుల కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించారు. గౌడ కులస్తుల పిల్లల కోసం గౌడ హాస్టల్ హైదరాబాదులోని నెలకొల్పారు. కాబట్టి ప్రభుత్వం అలాంటి మహనీయుడి జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ధర్మబిషం విగ్రహాన్ని ట్యాంక్ బండి పై నెలకొల్పాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టిసిఎస్ అధ్యక్షులు డి శంకర్ గౌడ్ గీతా పని వాళ్ళ సంఘం నాయకులు ఎం ప్రకాష్ గౌడ్ ఎం కృష్ణ గౌడ్ శ్రీధర్ గౌడ్ నరేష్ గౌడ్ రాజా గౌడ్ సురేష్ గౌడ్ ఏ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular