జిల్లా సహాయ కార్యదర్శిగా సోంపూర్ పోచిరాం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమంలో కొనసాగుతూ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే దిశ లో స్థానికంగా ఉద్యమాలను కొనసాగించడంలో ప్రతిరోజు ఒక అడుగు ముందుకేస్తూ కృషి చేస్తున్న సోంపూర్ పోచీరంకు ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా తమ కులస్తుల అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. కొన్నేళ్ల నుండి ఉద్యమాల్లో పాలుపంచుకుంటున్నారని ప్రస్తుతం బాన్స్వాడ నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇన్చార్జిగా కొనసాగుతూ కోటగిరి మండలంలో ఉద్యమాలను మరింత బలోపేతం చేసే దిశలో అడుగులు వేస్తున్నామని పోచీరం వ్యక్తం చేశారు. మందకృష్ణ ఉద్యమాలతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు అమలు చేశాయని గుర్తు చేశారు. ఇప్పటి కూడా మందకృష్ణ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉదృతం చేస్తామని అభాగ్యుల జీవితాలకు వెలుగులు నింపే దిశలో పనిచేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు. ఎస్సీ వర్గీకరణను ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రాధాన్యమిచ్చి బిల్లును కూడా ప్రవేశ పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. వర్గీకరణతో మాదిగలకు భవిష్యత్తు అభివృద్ధికి బాటలు సుగుమం అయ్యాయి అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జిల్లా సహాయ కార్యదర్శిగా పోచీరం
ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శిగా పోచీరమును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎం ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి మాదిగ మరియు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ ఎంపిక పత్రాన్ని అందజేశారు.
