కోటగిరి మండల కేంద్రంలోని పలుచోట్ల ప్రభుత్వ భూములు ఉన్నాయని అటువంటి భూములను కొంతమంది ఆక్రమణలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని వాటిని కాపాడాలని కోటగిరి మండల బిజెపి కార్యవర్గం తాసిల్దార్ కార్యాలయం వద్ద తమ నిరసన వ్యక్తం చేసి వినతి పత్రాన్ని అందజేశారు. విజయ పాల ఉత్పత్తి దారుల సంఘం సమీపంలో ఉన్న స్థలాన్ని కొంతమంది ఆక్రమించే ప్రయత్నం చేసి నిర్మాణాలు చేపట్టేట్లు ఉన్నారని అటువంటి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని బిజెపి మండల పార్టీ అధ్యక్షులు నవీన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాలను కాపాడకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని బిజెపి నాయకుల హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మోహన్ రావు తో పాటు పలువురు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములను కాపాడాలని కోటగిరి బిజెపి నిరసన
RELATED ARTICLES
