వామపక్ష పార్టీల ఆధ్వర్యన ధర్నా చౌక్ లో నిరసన
ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి:-
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ ప్లే కార్డులతో మరియు నల్ల బ్యాడ్జీలను ధరించి నేడు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో నిరసన చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నులకు,కార్పొరేటర్ వ్యక్తులకు అనుకూలంగా ఉన్నదని ఈ దేశంలో జీఎస్టీ చెల్లిస్తున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉందని వ్యవసాయ రైతాంగానికి, నిరుద్యోగులకు ఈ బడ్జెట్లో నామమాత్ర కేటాయింపులే ఉన్నాయని అన్నారు బోధన్- బీదర్ రైల్వే మార్గం ఊసే లేదని, ఈ మధ్యకాలంలో ప్రకటించిన పసుపు బోర్డుకు నిధులు కేటాయించలేదని ఇకనైనా బడ్జెట్ ను సవరించాలని డిమాండ్ చేశారు.

ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఖజా, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గంగాధర్ లు మాట్లాడుతూ దేశంలో రోజు, రోజు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించడం కోసం ఈ బడ్జెట్ రూపొందించలేదని పేద వర్గాలను వదిలి సంపన్న వర్గాలకు రాయితీలు చెల్లించే విధంగా ఈ బడ్జెట్ ఉందని, తెలంగాణ విభజన హామీ కేటాయింపులు లేవని, జాతీయ గ్రామీణ ఉపాధి పనులను సంవత్సరానికి 200 రోజులకు పెంచుతూ 600 రూపాయల కూలి చెల్లించే విధంగా బడ్జెట్ రూపొందించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు అడ్డికే రాజేశ్వర్ కే రాజయ్య సిపిఎం జిల్లా నాయకులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం సుధాకర్, వెంకన్న,సాయన్న, గంగాధర్ మరియు వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.
