Friday, February 13, 2026

286వ సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎంపీ ఎమ్మెల్యే శ్రీహరి

గిరిజన వేషధారణలో బంజార మహిళలతో కలిసి, సంప్రదాయ నృత్యం చేసిన ఎంపీ డా.కడియం కావ్య

భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

ఎంపీ, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవ సమితి సభ్యులు

త్వరలో కడియం ఫౌండేషన్ ద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ ఏర్పాటు

ప్రజలకు ఏ సమస్య వచ్చినా కడియం కుటుంబం అండగా ఉంటుంది

ఎంపీ డా.కడియం కావ్య

ద్రోణ వరంగల్ ప్రతినిధి

భాయ్ భియనా సేన రామ్ రామ్! అంటూ బంజారా భాషలో తన ప్రసంగాన్ని ప్రారంభించి అందరినీ ఆకట్టుకున్న ఎంపీ డా.కడియం.బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ అని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు అన్నారు.

స్టేషన్ ఘనపూర్ మండలం, శివుని పల్లి గ్రామంలోని పద్మావతి గార్డెన్స్ లో సంత్ సేవలాల్ జయంతి వేడుకలకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

అనంతరం సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, గిరిజన సాంప్రదాయాల ప్రకారం భోగ్ బండార్ సమర్పించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ ఆశ్శీసులతో, వారి మార్గదర్శకంలో గిరిజన బంజారాలు అభివృద్ధి చెందాలని ఎంపీ అన్నారు. బంజారా జాతికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా సంత్ సేవాలాల్ మహారాజ్ నిలిచారని జంతుబలులు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్య పరిచిన నేత సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ అని, ఆయన ఆశయాలను సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందన్నారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇచ్చిన మాట ప్రకారం ఏడాది కాలంలోనే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అధిస్తామని తెలియజేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి, రోడ్లు, కమీటిహల్స్ నిర్మాణానికి తన ఎంపీ లాడ్స్ నుండి నిధులు మంజూరు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. మహిళలు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు, సమాజం బాగుంటుందన్నారు. త్వరలో కడియం ఫౌండేషన్ ద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కడియం కుటుంబం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

పూర్వీకుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని బంజారా ఉద్యోగులకు సెలవులు ఇచ్చామన్నారు. అన్ని వర్గాలు వైశ్యామ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉండాలని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో బంజారా పూజారులు, నాయకులు, బంజారా మహిళలు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular