Friday, February 13, 2026

చంద్రబాబు అంటే నీకెందుకంత భయం

తెలంగాణను నాశనం చేసిందే కెసిఆర్ కుటుంబం

ఏవిజన్ లేని నాయకుడు కేసిఆర్

చంద్రబాబు జోలికి వస్తే ఖబడ్దార్

కెసిఆర్ పై ఎత్తోండ రాజేందర్ తీవ్ర అగ్రహం

ద్రోణ నిజాంబాద్ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎందుకంత భయమని టిడిపి నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో రూపంలో తెలంగాణ రాజకీయాల్లో వస్తున్నారని కెసిఆర్ ఇటీవలే వ్యాఖ్యలు చేయడం అర్ధరహితమని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాల పేరిట వైషమ్యాలను రెచ్చగొట్టి రాజకీయాల్లో స్వార్ధ బుద్ధితో వ్యవహరించిన “కేసీఆర్” చంద్రబాబును విమర్శించడం ఆయన అవివేకానికి నిదర్శనం అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి గల ఓ విజన్ కలిగిన నాయకుడని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 20-20 విజన్ ద్వారా అభివృద్ధి చేశారని అదేవిధంగా ప్రస్తుత తరుణంలో 2047 విజన్ కలిగిన నాయకుడని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మాజి ముఖ్యమంత్రి కేసీఆర్
ఏవిజన్ లేని నాయకుడని అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమ్మడి రాష్ట్రాల ప్రాంతీయ వైశ్యామ్యాలను రెచ్చగొట్టి ఇరు ప్రాంతాలను విడదీసిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాలికి ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తానని చెప్పిన కేసీఆర్ చంద్రబాబుపై విషం కక్కుతుండడం ఆశ్చర్యం వేస్తుందని అని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular