తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు పరిపాలించి అప్పుల కుప్పగా మార్చిన బి ఆర్ ఎస్ ప్రజల్లో మద్దతు కోల్పోయిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన డిపాజిట్లు దక్కవాలన్న ఉద్దేశంతో పోటీలో నుండి తప్పుకొని బిజెపితో దోస్తీ కట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నాలు చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని కమ్మరపల్లి మండల కేంద్రంలోని లలిత గార్డెన్స్ నందు పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి గెలుపున కై బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ అధ్యక్షతన నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి & పట్టభద్రుల ఎన్నికల బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి కేఆర్ నాగరాజ్ పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులకు దిశానిర్దేశం చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదు, డిపాజిట్ కూడా రాదనే బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని విమర్శించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవకూడదనే ఉద్దేశంతో బీజేపీతో జత కట్టిందని అన్నారు. ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది ఎమ్మెల్యేలు ఉనా, బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించలేదని, విభజన హామీలు నెరవేర్చలేదని, ఆ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. సుపరిపాలన చేశామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకున్నా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నదని చెప్పారు. 55 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని, జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నదని వెల్లడించారు. ఉద్యోగులకు నిరుద్యోగులకు మేలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.ఈ సమావేశంలో స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా మండల గ్రామస్థాయి నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
భారీ మెజార్టీతో ఎమ్మెల్సీలను గెలిపించాలని ఎమ్మెల్యే నాగరాజు పిలుపు
